పుష్ప మూవీపై ప్రభాస్ ఒపీనియన్ ఇదే..

  0
  57

  అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప మూవీ టాలీవుడ్ తో పాటుగా నార్త్ ఇండియాలోనూ సత్తా చూపించిందని అన్నారు. నార్త్ ఇండియాలో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసి, తెలుగు సినిమా సత్తా చాటిందని అన్నారు. గతంలో ఈ రికార్డ్ బాహుబలికి మాత్రమే ఉండేదని.. ఇప్పుడు పుష్ప మూవీతో పాటుగా కేజీఎఫ్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీలుగా మారాయని అన్నారు. మరో ఏడాదిలో దాదాపుగా 15 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ మూవీలుగా రాబోతున్నట్టు చెప్పారు.

  ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం రాధేశ్యాం. ఈ నెల 11వ తేదీన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ ఈ మూవీలో హస్త సాముద్రికుడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బాహుబలితో దేశంలోనే అతిపెద్ద స్టార్ గా అవతరించిన ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మూవీ యూనిట్ మొదలుపెట్టేసింది.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..