ఉక్రెయిన్ లో పట్టుబట్టి కుక్కతో సహా విమానం ఎక్కాడు..

  0
  287

  తన కుక్క లేకుండా తాను ఉక్రెయిన్ వదిలిపోనంటూ పంతం పట్టిన , భారతీయ విద్యార్థి రిషబ్ కౌశిక్ ఎట్టకేలకు తన కోరికనెరవేర్చుకున్నాడు. ఉక్రెయిన్ ని వదిలిన ఎయిర్ ఇండియా విమానంలో , రిషబ్ కి , అతడి పెంపుడు కుక్కకూ అనుమతి ఇచ్చారు. దీంతో అతడు అమితానందంతో తన కుక్క తో ఫొటో దిగి , విమానం ఎక్కాడు.

  గత నెల 18 నుంచి యుద్ధం అనివార్యం అని తెలిసినప్పటినుంచి , తన కుక్కకు పాస్ పోర్ట్ కోసం తాను , భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నానని చెప్పాడు. అయితే తన కుక్క విషయం తేలినతరువాతే తాను ఉక్రెయిన్ వదులుతానని చెప్పాడు.

  ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో అధికారులు రిషబ్ కౌశిక్ కుక్కకు కూడా పాస్ పోర్ట్ ఇచ్చి , అతడితో తీసుకొచ్చే ఏర్పాటు చేశారు.. కిర్కీవ్ ఎయిర్ పోర్ట్ లో రిషబ్ కౌశిక్ తన పెంపుడు కుక్కతో విమానం ఎక్కుతున్న వీడియోని , రక్షణ శాఖ సహాయమంత్రి జనరల్ వికె సింగ్ పోస్ట్ చేశారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..