ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే ..

  0
  53

  యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. రాధేశ్యామ్‌, స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అన్నీ పాన్ ఇండియా చిత్రాలే. తాజాగా మ‌రో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే న‌టిస్తోంది. ఇక బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఈ చిత్రంలో భాగ‌స్వామ్యం అవుతుండ‌డం విశేషం. గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు అమితాబ్ పాల్గొన్నారు. ముహూర్తపు షాట్ బిగ్ బీ మీదనే తీశారు. కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. తొలి షాట్ కు ప్రభాస్ క్లాప్ కొట్టారు. సైన్స్ ఫిక్ష‌న్ గా రూపొందే ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు స్క్రీన్ ప్లే ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. ఈ మూవీకి ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?