ట్రాఫిక్ డివైడర్లలో కరెంట్ ఉత్పత్తి.. అద్భుత ప్రయోగం..

  0
  216

  అవసరం అనేది అనేక అద్భుతాల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.. అలాంటిదే ఈ ట్రాఫిక్ విండ్ ఎనర్జీ ప్రయోగం.రోడ్డు మీద పోయే బస్సులు , లారీలు , స్కూటర్లు, కార్లు , బైకులు ఇలాంటి వాటితో బోల్డంత విద్యుత్ తయారు చేయవచ్చునని టర్కీ ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధన చేసింది.. ఇది ఇప్పుడు ప్రయోగాత్మక స్థాయిని అధిగమించి ఆచరణాత్మక స్థాయికి చేరుకుంది. టర్బైన్లు లాంటివి ట్రాఫిక్ డివైడర్ లో పెడితే దాని పక్కనేపోయే వాహనాల వేగానికి టర్బైన్లు తిరుగుతాయి .

  ఈ టర్బైన్లు తిరిగి, దాన్ని విద్యుత్ శక్తిగా మారుస్తాయి . ఒక టర్బైన్ నుంచి ఒక కిలోవాట్ విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు అని నిరూపించారు. ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణగా మిగిలిపోయింది. శాస్త్రవేత్తలు దీన్ని ప్రశంసిస్తున్నారు . ఈ ఆవిష్కరణతో విద్యుత్ కొరత చాలా వరకూ తగ్గించే అవకాశం ఉంది . విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా ట్రాఫిక్ లో గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత అనేది కూడా విశ్లేషించి చెబుతుంది. రాబోయే కాలంలో ముఖ్యంగా భారతదేశంలో వాహనాలు వేగానికి , మనకున్న వాహనాల సంఖ్యకు బోల్డంత విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..