ఒక ఎమ్మెల్యే ఆపం, కోడిగుడ్డు.. 184 బిల్లు. రచ్చ , రచ్చ..

  0
  336

  హోటల్లో టిఫిన్ చేసి , దానికి కట్టిన బిల్లుపై , ఓ ఎమ్మెల్యే నానాయాగీ చేశాడు.. ఈ ఎమ్మెల్యే రచ్చ చివరకు విచారణలకు , మంత్రివర్గంలో చర్చకు దారితీసిందట.. కేరళలోని అలప్పుజా నియోజకవర్గ ఎమ్మెల్యే చిత్తరంజన్ ఆపం , కోడిగుడ్డు ,వివాదం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది . ఇంతకీ ఆ వివాదం కిందిస్థాయి అధికారుల నుంచి మంత్రివర్గ సమావేశంలో చర్చకు దారితీసింది. అదేదో సామెతగా ఏమీ పని లేక పిల్లి తల గొరిగినట్లు ఈ ఎమ్మెల్యే ఆ సమస్యను పట్టుకుని గొడవ చేస్తున్నారు. చివరకు జిల్లా కలెక్టర్, ఏకంగా ఎమ్మెల్యే టిఫిన్ బిల్లుపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశించారు.. ఇంతకీ సమస్య ఏంటో తెలుసా ?? సమస్య వింటే నవ్వొస్తుంది . ఎమ్మెల్యే ఒక హోటల్లో నాలుగు ఆపాలు , రెండు మసాలా కోడిగుడ్లు తిన్నాడు..

  ఆయన టిఫిన్ కి ఆ హోటల్ వాళ్ళు 184 రూపాయలు బిల్లు వేశారు . 184 రూపాయలు ఎందుకు అయింది అని అడిగితే ఒక ఆపం 15 రూపాయలు అని , కోడి గుడ్డు మసాలా కి 50 రూపాయలు అయిందని చెప్పారు. ఫ్యాన్ గాలికి ఎగిరిపోయే ఆపం కి 15 రూపాయలు అన్యాయమని , రెండు కోడిగుడ్లు మసాలాలకు కలిపి 50 రూపాయలు ఎందుకంటూ హోటల్లో గొడవ చేసాడు. హోటల్ లో ఏసీ కూడా లేదని బయట మాత్రం ఎసి అని బోర్డు ఉందని అభ్యంతరం చెప్పాడు. లోపల రెస్టారెంట్ లో మెనూ కూడా చేతికి ఇవ్వలేదని , తన చేత డబ్బులు కట్టించారని చెప్పాడు . అదే హోటల్లో భోజనం 100 రూపాయలు తీసుకుంటున్నారని విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ దీనిపై విచారణ చేసి , హోటల్ పై చర్యలు తీసుకోలేమని కలెక్టర్ స్పష్టం చేసింది.. దీంతో తన సమస్యను ముఖ్యమంత్రికి ఒక పిటిషన్ పంపించారు ఈ ఎమ్మెల్యే పిటిషన్ సోషల్ మీడియాలో రావడంతో ఇది ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో చర్చకు దారితీసింది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..