పెళ్లి తరువాత ఫోటోషూట్ లో మృత్యువు కాటేసింది..

  0
  510

  సెల్ఫీలు , కొత్త జంటల పోస్ట్ వెడ్డింగ్ షూట్, సేవ్ ది డేట్ పేరుతో చేసే ఫోటో షూట్ లు ఒక్కోసారి ప్రాణాంతకం అవుతున్నాయి .. కేరళలో ఈ కొత్త జంట వివాహమైన 20 రోజులకి పోస్ట్ వెడ్డింగ్ షూట్ కు వెళ్ళింది. నది మధ్యలో ఫోటోలు తీసుకుంటుండగా ప్రవాహ వేగానికి పెళ్లి కొడుకు నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు, పెళ్లి కూతురు కొన ఊపిరితో బయటపడి ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతోంది . ఆమె పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది.

  కేరళలోని కోజికోడ్ కి సమీపంలోని కుట్టియాది ప్రాంతంలో ఈ ఘటన జరిగింది . గత నెల 14వ తేదీన అనే కార్తీక అనే అమ్మాయికి , రెజిల్ అనే అబ్బాయికి పెళ్లి జరిగింది . పెళ్లయిన తర్వాత ఆదివారం పోస్ట్ వెడ్డింగ్ షూట్ కోసం నది కి వెళ్ళారు . నదిలో తెప్ప మీద ఉండగానే నీటి ప్రవాహం పెరిగి ఇద్దరూ నదిలో పడిపోయారు .

  ఫోటో గ్రాఫర్ కేకలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళని కాపాడేందుకు నదిలోకి దూకి ఇద్దర్నీ కాపాడగలిగినా ,ఒడ్డుకు తీసుకు వచ్చే టప్పటికి పెళ్ళికొడుకు రెజిల్ చనిపోయాడు . పెళ్లి కూతురు కార్తీక కొన ఊపిరితో హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది . ఆమె పరిస్థితి కూడా ప్రమాదం గా ఉందని డాక్టర్లు చెప్పారు . కొత్త జంట ఇలా మృత్యువాత పడడంతో , పెళ్లికూతురు ప్రాణాల కోసం పోరాడుతుండటంతో బంధువులు తల్లిదండ్రులు జీర్ణించుకోలేక వారి రోదనలు మధ్య హాస్పిటల్ ప్రాంతం లో విషాదం నెలకొంది..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.