అంబాసిడర్ కారుకి ఇలా వీడ్కోలు చెప్పారు.. ఎందుకో తెలుసా..??

    0
    147

    అంబాసిడర్ కారు ,మన దేశం గర్వించదగిన కారు.. ఒకప్పుడు మన దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచిన కారు . ఎమ్మెల్యే మొదలు రాష్ట్రపతి వరకు , పేద టాక్సీ డ్రైవర్ మొదలు కోటీశ్వరుడు వరకు అంబాసిడర్ కారు వాడిన కాలమది .. పేద గొప్ప తేడా లేకుండా అందరికీ ఆత్మబంధువైన కారు భారతీయ రోడ్లకు సరిపోయిన కారు ఇది. పట్టణాలకు పల్లెలకు రెండింటికీ సరిపోయిన అలాంటి కారు ఇప్పుడు కనుమరుగైపోయింది . భారతదేశంలో 30 ఏళ్ల క్రితం చూస్తే అటు ఇటు అంబాసిడర్ కార్లు ఉండేవి. నూటికి 90 శాతం అప్పట్లో అంబాసడర్ కార్లు ఉండేవి. అందరికీ ఆత్మ బంధువు అంబాసిడర్ ..

    అలాంటి అంబాసిడర్ కారు చిట్టచివర కారుకి రైల్వే శాఖ వీడ్కోలు చెప్పింది . సెంట్రల్ రైల్వే లో ముంబైలో చిట్టచివరగా మిగిలిన ఈ అంబాసిడర్ కారు 38 ఏళ్ల రైల్వే అధికారులకు సేవలందించింది. ఇప్పుడు ఆ కారు తన సర్వీస్ నుంచి రిటైర్ అయి పోయింది . దీన్ని ఎవరికి ఇస్తారో తెలియదు గానీ ఈ కారుకు రైల్వే అధికారులు ఘనంగా వీడ్కోలు చెప్పారు . పనిలో పనిగా డ్రైవర్కు కూడా వీడ్కోలు చెప్పేశారు . భారతదేశంలో కోట్లాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన కారు ఇది..

    మెకానికల్ , ఎలక్ట్రీషియన్ పనివాళ్ళు, టింకరింగ్ , పెయింటింగ్ , లేత్ కార్మికులు , సీట్లు పనిచేసేవాళ్ళు ఇలా అన్ని రకాల కార్మికులకు ఉపాధి కల్పించిన ఒకే ఒక కారుఅంబాసడర్. అయితే ఇప్పుడు కార్లకు మెకానికులతో పని లేకుండా పోవడంతో కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి లేకుండాపోయింది. ఈ దేశంతో అంబాసడర్ కారు అనుబంధం అలాంటిది . అలాంటి చిట్టచివరి కారు భారతీయ రైల్వే నుంచి తన సేవలను విరమించుకుంది . దానితో పాటే ఆ డ్రైవర్ కూడా రిటైర్ అయిపోయారు.. ఈ కారు గత 38 ఏళ్ళు గా భారతీయ రైల్వే సేవలు అందించింది, అందుకే దానికి ఘనంగా వీడ్కోలు చెప్పారు..

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.