వడిలో చిట్టి చెల్లితో బడిలో చిన్నారి అక్క..

    0
    166

    పదేళ్ల వయసులో ఆ చిన్నారికి తల్లికి ఉన్నంత కొండంత ప్రేమ, పరిపక్వత ,అంకితభావం, ఓర్పు ఇవన్నీ ఉన్నాయి .. బహుశా చాలా మంది ఆడపిల్లలకు ఇవన్నీ పుట్టుకతోనే వచ్చే లక్షణాలు ఏమో ..? మణిపూర్లో ఓ పదేళ్ల చిన్నారి నాలుగో తరగతి చదువుతూ తన చిట్టి చెల్లిని ఒడిలో పెట్టుకుని బడికి వస్తుంది. తన ఊరి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం తన చెల్లెలుని ఎత్తుకుని క్లాస్ కు వస్తోంది . తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు కావడం , పొలంలో పనులకు పోవడంతో రెండేళ్ల చిన్నారి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి.. దీంతో పదేళ్ల ఈ పాప చెల్లి , ఆలనా పాలనా ఆలనా పాలనా చూసుకోవాలి . తల్లిదండ్రులు పొలంకి పోవడం , చదువు మీద ఆసక్తి తో ఉన్న మిలియర్ తన చిట్టి చెల్లెలుని , ఎత్తుకొని అంత దూరం నడిచి స్కూల్ కి వచ్చి క్లాస్ రూమ్ లో ఒడిలో పెట్టుకుని పాఠాలు వింటుంది . బుద్ధిగా చదువుకుంటుంది..

    మిలియర్ ఈ ఫోటోను కొంతమంది టీచర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన మణిపూర్ అటవీ శాఖ మంత్రి వెంటనే స్పందించి ఆ పాపను తల్లిదండ్రులను తనవద్దకు తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వాళ్లను పిలిపించి మిలియర్ డిగ్రీ వరకు చదువుకు ఖర్చులు ఇస్తానని హామీ ఇచ్చాడు . పాప చదువుకు ఆటంకం లేకుండా తల్లిదండ్రులకు ఉపాధి ఏర్పాటు చేస్తానన్నాడు . కొన్ని సంఘటనలు కొంత మంది జీవితాలను మార్చివేస్తాయి. అటువంటిది పదేళ్ల చిన్నారి , తన చెల్లిని ఒడిలో పెట్టుకుని స్కూల్ కి హాజరు అవుతున్న ఫొటో ఇప్పుడు ట్రెండింగ్.

    చిన్నారి అక్క , అంకితభావం ,ప్రేమ , బాధ్యత వీటన్నిటికీ నెటిజన్లు తెగ ముచ్చట పడిపోయారు . ఆడ పిల్లలకు ఇలాంటి ఓర్పు ,బాధ్యత ,ప్రేమ పుట్టుకతోనే వచ్చే లక్షణాలని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు . ఇప్పుడు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అయినా వాళ్ళు దానికి ఒప్పుకోవడం లేదు . తమ బిడ్డను కష్టపడి చదివిస్తామని మాత్రం చెబుతున్నారు ..మంత్రి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటామని ఇంతకు మించి ఇంకేమీ అవసరం లేదని కూడా ఆ కష్టజీవులు గర్వంగా చెబుతున్నారు..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.