రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా లేడి డ్రైవర్ దైర్యంగా..

  0
  143

  రెండు రైళ్లు..

  ఎదురెదురుగా వస్తే ఏం జరుగుతుంది..?

  రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే ఏమవుతుంది..? ప్రమాదం జరుగుతుందని ఇన్నాళ్లూ అనుకునే వాళ్ళం.. అయితే ఇకపై మాత్రం మన దేశంలో, ఇలా ఎదురెదురుగా రైళ్లు వచ్చినప్పటికీ ఏ ప్రమాదం జరుగదు. ఎందుకంటే మన దేశంలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. ప్రత్యేకమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. కవచ్ పేరుతో ఓ ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. ఈ నూతన భద్రత వ్యవస్థ కారణంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పటికీ ఏ ప్రమాదం జరుగదు. 380 మీటర్ల దూరంలోనే రైళ్లు నిలిచి పోయేలా ఇందుకోసం ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా రైల్వే లైన్లో మలుపులు, బ్రిడ్జీలు ఉండే ప్రాంతాల్లో కూడా ఆటోమేటిక్ గా రైలు నెమ్మదిగా వెళ్లేలా ఈ భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ కవచ్ భద్రత వ్యవస్థను పరిశీలించారు.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..