కరోనా ఉన్నా తిరగడం ఆపలేదు-రాళ్లతో కొట్టి హాస్పిటల్లో వేశారు.

    0
    39

    క‌రోనా పాజిటివ్ ఉన్న వ్య‌క్తులు బ‌య‌ట తిరిగితే ఏమ‌వుతుందో మైసూర్ స‌మీపంలోని కారాపురా గ్రామంలో చేసి చూపించారు. ఓ యువ‌కుడు క‌రోనా పాజిటివ్ అయిన‌ప్ప‌టికీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తూ బ‌య‌ట తిరుగుతున్నాడు. అత‌నిని హోం క్వారంటైన్ కి పంపించి జాగ్ర‌త్త‌లు చెప్పినా, అత‌ను వాటిని పాటించ‌లేదు. బ‌య‌ట విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నాడు. కాల‌నీలో చిన్న పిల్ల‌ల‌తో కూడా తిరుగుతూ దుకాణాల వ‌ద్ద‌కు వెళుతున్నాడు. స్థానికులు అత‌న్ని బ‌య‌ట తిర‌గ‌వ‌ద్ద‌ని చెప్పినా విన‌క‌పోవ‌డంతో మ‌రింత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడు. దీంతో స్థానికులు అత‌న్ని రాళ్ళ‌తో కొట్టారు. తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితుడు హెచ్‌డీ కోటే కోవిడ్ కేర్ సెంట‌ర్ కి త‌ర‌లించారు. అప్ప‌టికే అత‌ని వ‌ల్ల గ్రామంలోని చాలామందికి క‌రోనా సోకింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇంట్లోనే ఉండేందుకు క‌రోనా పాజిటివ్ అయిన ఆ యువ‌కుడికి ఆహారం, మెడిసిన్స్ అంద‌చేశారు. అయినా అత‌ను అవేవీ ప‌ట్టించుకోకుండా గ్రామంతో తిర‌గ‌డం మొద‌లుపెట్టాడు. గ్రామ‌స‌ర్పంచ్ డి.స్వామి ఆ యువ‌కుడిపై ఫిర్యాదు చేశారు.

     

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.