నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు..

  0
  758

  బాలీవుడ్ నటి పూనమ్ పాండే , లాకప్ కార్యక్రమంలో సామ్ బాంబే తో సహజీవనంలో, ఆ తరువాత వివాహబంధంలో తానుపడ్డ కష్టాలు విని ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లాయి. వెండితెర వెలుగుల వెనుక ఇంత విషాదం ఉంటుందా అన్న భావన కలిగింది. కంగనా రనౌత్ రియాలిటీ షో , లాకప్ కార్యక్రమంలో ఆమె సామ్ బాంబే తనను పెట్టిన చిత్రహింసలను ఇలా వివరించింది. ప్రతిరోజూ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు. గదిలో పెట్టి లాక్ చేసేవాడు. తిండికూడా పెట్టేవాడు కాదు. ఎన్ని మొబైల్ ఫోన్లు పగలకొట్టాడో లెక్కలేదు. సహజీవనంలో నాలుగేళ్ళ పాటు కొంత వరకు హింసలు , భరించినా , పెళ్ళైతే మారతాడనుకునేదాన్ని. పెళ్ళైన తరువాత కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి.

  దుబాయిలోనే గదిలో బందించి రోజూ కొట్టేవాడు. నిద్రకూడా పోనిచ్చేవాడు కాదు. చనిపోదామనుకొని చాలాసార్లు ప్రయత్నం చేశా.. మారుతాడనుకొని , మళ్ళీ ఆలోచనలో పడేదాన్ని.. ఇలా రోజులు గడుస్తున్నా , అతడిలో మార్పులేదు. ఇలాంటి లాకప్ ప్రోగ్రాం మేలు.. కనీసం లోపలపెట్టి , కడుపునిండా బొజనంపెడతారు.. కంటినిండా నిద్రపోవచ్చు అని చెప్పింది. నాలుగేళ్ళ సహజీవనం తరువాత పూనమ్ పాండే 2020లో ప్రొడ్యూసర్ , దుబాయ్ కి చెందిన సామ్ బాంబేని పెళ్లిచేసుకుంది. 2021లోనే విడాకులు ఇచ్చేసింది.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..