రోజా ఇంట్లో పూజలు అందుకోసమేనా..??

  0
  163

  వైసీపీ ఎమ్మెల్యే రోజా అటు రాజకీయాలతోనూ.. ఇటు సినిమా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి కూడా రోజా అంతే ప్రాధాన్యం ఇస్తుంటుంది. తన భర్త సెల్వమణి.. పిల్లలిద్దరితో కూడా అంతే సరదాగా తనకున్న సమయాన్ని వెచ్చిస్తుంది. దీనికి తోడుగా ప్రతీ పండుగను ప్రత్యేకంగా శాస్త్ర ప్రకారం జరుపుకుంటుంది.

  తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసి.. పండుగలను సెలెబ్రేట్ చేసుకుంటుంది. వినాయకచవితి, సరస్వతి పూజ, వరలక్ష్మి వ్రతం ఇలా పండుగ ఏదైనా తన ఇంట్లో ప్రత్యేకంగా జరగాల్సిందే.. ఇటీవల బంధువులందరినీ ఓ ప్రత్యేక పూజ కూడా చేసింది రోజా.. లక్ష్మీ దేవి వ్రతం చేసి.. తన ఇంట్లో ప్రత్యేకంగా దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసింది

  పూలతో అమ్మవారి ప్రతిమను కూడా ఏర్పాటు చేసి.. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగింది. అయితే ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు రోజాపై మరోరకంగా వ్యాఖ్యనాలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసమే ప్రత్యేక పూజలు చేసిందని అనుకుంటున్నారు. రాజకీయంగా మంచి జరగాలని ఈ పూజలు చేసినట్టు నగరి నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారట..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..