ప్రతిరోజూ రాత్రి 12 గంటలకు ఈ బాలుడు ఒక్కడే ఇలా ..

  0
  360

  ఈ బాలుడి జీవితం మన పిల్లలకు ఆదర్శం అవుతుంది , ఈ బాలుడి ఆశయం ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉందని నిరూపిస్తుంది , ఈ బాలుడికి కష్టం స్వయంకృషి ఒక మంచి నిదర్శనం.. నేటి తరం పిల్లలకు ఈ బాలుడు గురించి చెబితే ఎంతో కొంత స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది . ఈ బాలుడి పేరు వినోద్ మెహ్రా . రాత్రి 12 గంటల సమయంలో నోయిడా రోడ్లపై పరుగులు తీస్తుంటే ప్రముఖ సినీ నిర్మాత వినోద్ కాప్రి చూశాడు . ఆ బాలుడు ఏదో ఆపదలో ఉన్నాడని అనుకున్నాడు, కారు లోకి వస్తే లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అయితే ఆ బాలుడు అందుకు నిరాకరించాడు.

  తాను ప్రతి రోజు ఇలాగే పరుగు తీసి తన ఇంటికి చేరుకుంటారని చెప్పాడు. ఎంత దూరం ఉంది అని అడిగాడు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది అని చెప్పాడు, ప్రతిరోజు ఇలాగే అర్ధరాత్రి 12 గంటలకు 10 కిలోమీటర్ల దూరం పరుగుతోనే తన గదికి పోతాడు. అక్కడ తన పెద్ద సోదరుడు కూడా ఉంటాడు.. ఇంతకీ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే , సైన్యంలో చేరాలని ఆశ ఉందని లో , చేరాలంటే రన్నింగ్ రేస్ , ఫిట్నెస్ అనేది చాలా ప్రధానమని అందుకే ప్రతి రోజూ డ్యూటీ అయినా తరువాత ఇలా పరుగుతోనే 10 కిలోమీటర్ల దూరంలోని గదికి వెళతానని చెప్పాడు.

  నువ్వు ఎక్కడ పని చేస్తున్నావ్ అని అడిగితే మేక్ డోనాల్డ్స్ లో సర్వర్ గా ఉన్నానని చెప్పాడు. కనీసం భోజనం చేసావా అనిఅడిగితే , రూమ్ కెళ్ళి వంట చేసుకుంటానని చెప్పాడు. భోజనం పెట్టిస్తానన్నా నిరాకరించాడు . ఈ ఈ బాలుడి సంకల్పానికి వినోద్ చాలా ఆనందం ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు, ఈ బాలుడి సంకల్పం ,ఆశయం ,ఆలోచన ,స్వయంకృషి నేటి తరం పిల్లలకు ఆదర్శం అని చెప్పాడు. తల్లిదండ్రులు ఈ వీడియోను పిల్లలకు చూపించాలని ఈ బాలుడు సంకల్ప బలమే కాదు అంతకు మించిన దీక్ష , దేశభక్తి , దేశానికి అవసరం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నాడు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..