ప్రియురాలిని చంపిన పోలీసాఫీసర్..

  0
  133

  భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయణం నడిపాడు ఆ పోలీసాఫీసర్. నా భార్య అంటే నాకు ఇష్టంలేదు, విడాకులిచ్చేస్తాను, నీతోనే ఉంటానంటూ కమ్మగా మాటలు చెప్పాడు. అతడి పేరు అజయ్ దేశాయ్. అహ్మదాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో అధికారి. ఆ అమ్మాయి పేరు స్వీటి పాటిల్. పోలీసాఫీసర్ చెప్పే మాటలు నిజమేనని నమ్మిన స్వీటి, అతడికి శారీరకంగానూ దగ్గరైంది. కొన్నాళ్లు ఇద్దరూ సహజీవనం చేశారు. చివరకు ఆమె ఒత్తిడితో గుడిలో పెళ్లి చేసుకున్నాడు.

  అప్పటినుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు పెళ్లం కావాలి, ప్రియురాలు కావాలి అంటూ.. ఇద్దరితో ఉంటున్నాడు. అయితే స్వీటి మాత్రం భార్యకు విడాకులిచ్చి రావాలంటూ గొడవ చేయ సాగింది. భార్య అంటే ఇష్టం లేకపోయినా, విడాకులిస్తే, భర్ణం కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అది ఇష్టంలేక అజయ్ దేశాయ్ ప్రియురాలిని వదిలించుకోవాలనుకున్నాడు.

  స్వీటితో కావాలనే గొడవపడి, ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని, తన స్నేహితుడు కిరిట్సింగ్ జడేజాకి చెందిన హోటల్‌ ఆవరణలో పూడ్చి పెట్టాడు. స్వీటి కనిపించడంలేదని బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి వ్యవహారం బయటపడింది. అజయ్ విచారణలో స్వీటిని చంపినట్టు నిజం ఒప్పుకున్నాడు. ప్రసుత్తం అతను, వడోదర పోలీసులు కస్టడీలో ఉన్నాడు.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?