భార్య సరసాలు.. బిడ్డలకోసం భర్త కన్నీళ్లు..

  0
  539

  బిడ్డలకోసం, పరువుకోసం, భార్య అక్రమ సంబంధాన్ని మౌనంగా భరించాడో భర్త. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు తీసి భర్తకు పంపిస్తే అప్పుడు కూడా మౌనంగానే భరించాడు. డబ్బులివ్వకపోతే ఈ ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడల్లా డబ్బులిచ్చాడు. దానికి ఒకే ఒక కారణం, ఆ ఫొటోలు బయటపడితే, తన బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందన్న బాధ. అయితే భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి వేధింపులు ఎక్కువ కావడం ఇటీవల 20లక్షల రూపాయలు ఒకే దఫా చెల్లించమని అడగడంతో దాదర్ కి చెందిన ఆ వ్యాపార వేత్త కుమిలిపోయాడు. తనకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడిని కలసి తన మనసులోని బాధ చెప్పుకున్నాడు. స్నేహితుడి సలహా మేరకు పోలీసుల్ని కలిశాడు. సింగ్ అనే ఆ వ్యక్తి అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చేవాడని, తనకు స్నేహితుడని చెప్పారు. అయితే తర్వాత తన భార్య అతడితో అక్రమ సంబంధం ఏర్పరచుకుందని చెప్పాడు. ఆ తర్వాత తన భార్య నగ్నంగా ఉన్నప్పటి ఫొటోలను తీసి, వాటిని చూపించి ఏప్రిల్ నెలనుంచి తనను బెదిరిస్తున్నాడని, డబ్బులివ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పాడు. తన బిడ్డల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని తానిప్పటి వరకు డబ్బులిచ్చినా, ఇక భరించలేని స్థితికి వచ్చానని, ఆస్తులమ్మి డబ్బులివ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సంతోష్ కుమార్ సింగ్ అనే బ్లాక్ మెయిలర్ కోసం అన్వేషణ ప్రారంభించారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?