ఏకంగా ఎస్పీనే అలా వాడేశారు….

    0
    4559

    ఎస్పీ సెంథిల్ కుమార్. నేరస్తులకు సింహ స్వప్నం. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడాయనకు కొత్త సమస్య వచ్చిపడింది. ఆయన పేరుతో ఎవరో నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. ఎస్పీ రిక్వెస్ట్ పంపితే ఎవరైనా యాక్సెప్ట్ చేయకుండా ఊరుకుంటారా..? అలా చేసిన వెంటనే సదరు అకౌంట్ నుంచి డబ్బులు కావాలనే మెసేజ్ వస్తుందట. దీంతో ఈ వ్యవహారంపై కొందరు నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేశారు. ఆయన అవాక్కయ్యారు.
    సోషల్ మీడియాలో పలువురు ప్రముఖుల నకిలీ అకౌంట్‌ లు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చాలా మంది ప్రముఖులు, అధికారులు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. నకిలీ ఖాతాలను సృష్టించి నిందితులు డబ్బులు కావాలంటూ మెస్సెజ్‌లు చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా ఎస్పీకి సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. చిత్తూరు ఎస్పీ పేరుతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను క్రియేట్‌ చేశాడు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఫోటోతో ఫేస్‌బుక్‌ అకౌంట్ క్రియేట్ చేసి వి.కోటకు చెందిన సునీల్ అనే యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. అనంతరం యాక్సెప్ట్ చేసిన సునీల్‌ తో ఆ ఖాతా నుంచి సందేశాలు వచ్చాయి.
    ఎస్పీ నకిలీ ఖాతా నుంచి గూగుల్ పే ఉందా అంటూ చాటింగ్ మొదలైంది. స్నేహితుడికి ఆక్సిడెంట్ అయిందంటూ ఒక ఫోటోను పోస్ట్ చేసి 15 వేల రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేయాలని ఫేక్‌ అకౌంట్‌ ఖాతాదారుడు కోరాడు. అనుమానం వచ్చిన సునీల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ నకిలీదని గుర్తించారు. ఎస్పీ పేరుతో ఆగంతకుడు క్రియేట్ చేసిన ఫేస్ బుక్ అకౌంట్‌పై పోలీసులు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అకౌంట్‌ నుంచి ఎవరెవరికి.. మెస్సెజ్‌లు పంపించాడు.. ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు అన్న కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?