మనం పోలీసులంకదా.?బిర్యానీకి డబ్బులు ఇవ్వాలా.?

    0
    1552

    మనం పోలీసులంకాదా..? బిర్యానీకి మనంకూడా డబ్బులు ఇవ్వాలా.. ? ఈ మాట సాదాసీదా పోలీసు కానిస్టేబుల్ డి కాదు.. సాక్షాత్తు ఒక యువ మహిళా ఐపీఎస్ అధికారిది.. ఇప్పుడీ ఆడియో సంభాషణ సొషల్మీడియాలో వైరల్ అవుతోంది. పూణే లోని విశ్రాంతి బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ డెప్యూటీ కమీషనర్ స్థాయి అధికారిణికి , బిర్యానీ తినాలని కోరిక పుట్టింది. వెంటనే ఫోన్ చేసి , మంచి మటన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని స్టాఫ్ ని విచారించింది. దేశీఘీ రెస్టారెంట్ లో మంచి మతం బిర్యానీ దొరుకుతుందని చెప్పాడు. వెంటనే బిర్యానీ తెప్పించమని ఆర్డర్ వేసింది. నాకు చికెన్ , నా భర్తకు మటన్ బిర్యానీ , ప్రాన్ మసాలా , ఫిష్ ఫ్రై కూడా ఆర్డర్ ఇచ్చింది. మనం పోలీసులం కదా , మనల్ని కూడా బిల్లు అడుగుతారా అని ప్రశ్నించి , ఒక వేళ బిర్యానీకి , ఇతర ఐటెమ్స్ కి డబ్బులు అడిగితే , లోకల్ ఇన్స్పెక్టర్ కి చెప్పి , తీసుకురండి అని ఆర్డర్ వేసింది.. ఈ సంభాషణ ఆడియో క్లిప్ బయటకు రావడంతో , కమీషనర్ విచారణకు ఆదేశించారు. అయితే అధికారిణి మాత్రం దీనివెనుక పెద్దకుట్ర ఉందని చెప్పింది. తన ఆడియో మార్ఫింగ్ చేశారని , సైబర్ సెల్ కి ఫిర్యాదు చేశారు. తాను కొంతమంది అధికారులను బదిలీ చేశానన్న కక్షతో ఇలాచేశారని అన్నారు..

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?