దానికి ముందు అమ్మాయిలే మద్యం కొన్నారు.

    0
    2777

    బెంగుళూరు కోరమంగళం వద్ద జరిగిన దారుణ ఆడీ కారు ప్రమాదంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం, మృతులలో డీఎంకే ఎమ్మెల్యే కొడుకు , కోడలు కూడా ఉన్న విషయం తెలిసిందే.. ప్రమాదం రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగింది.. ప్రమాదం జరిగిన సమయంలో కారు 150 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంది.. ముందు ట్రాఫిక్ ఇనుప స్తంభాలను ఢీకొని , తర్వాత బ్యాంక్ భవనం సెల్లార్ ముందు బిల్డింగ్ కాంక్రేట్ బీమ్ ను ఢీకొనిందని నిర్థారించారు.. కారులో ఎవరూ సీట్ బెల్ట్ లు పెట్టుకోలేదు.. అందువల్లనే ఎయిర్ బాగ్స్ ఓపెన్ కాలేదు.

    ఇప్పుడు విచారణలో తేలిన తాజా విషయం ఏమిటంటే , ప్రమాదం జరిగిన రోజు రాత్రి , కారులో ఉన్న ఇద్దరు యువతులు , మద్యం కొనుగోలు చేశారు. వారిని ఇషితా , బిందు గా గుర్తించారు. మద్యం సీసాలు కొనుగోలు చేసిన అమ్మాయిలు , ఆడి కారు వద్దకొచ్చి కారెక్కారు. అందరూ కలిసి ఒక పబ్ కి వెళ్లారు. అది రిపేర్ లో ఉండటంతో , అక్కడనుంచి బయలుదేరారు.. అప్పటివరకు సిసి కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.. తర్వాత మద్యం బాటిల్స్ తో పార్టీ ఎక్కడ చేసుకున్నారన్న విషయం తేలాల్సివుంది..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్