నడిరోడ్లో అమ్మాయి వీరంగం.. దెబ్బలతో దారికొచ్చింది..

  0
  907

  ఏమి జరిగిందో ఏమో బిజీ ట్రాఫిక్ ఉన్న నడిరోడ్లో ప్రియుణ్ణి దారుణంగా కొడుతొంది.. బైక్ మీద నుంచి , లాగి , లాగి కొడుతొంది. వాడు ప్రియురాలి దాడినుంచి తప్పిచుకోవాలని చూసినా తన తన స్కూటీ ని అడ్డం పెట్టి అతడి బైక్ నిలిపి ట్రాఫిక్ మధ్యలో చొక్కాపట్టుకుని కొట్టిపారేసింది . అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న రాళ్లు తీసుకుని బైక్ పై విసిరేసింది . అతన్ని నానా హింసలు పెట్టింది. ఈ దారుణాన్ని రోడ్డు పోతున్న వాళ్లంతా వీడియోలు తీస్తున్నారు. పాపం , ఎవరూ ప్రియుడి రక్షణకు రాలేదు. ఈలోగా అటు పోతున్న డెలివరీ ఫుడ్ డెలివరీ బాయ్ ఈ దారుణం చూసి తన బైక్ ఆపి ఇద్దరి మధ్య తగాదా ఏంటో తీర్చేందుకు ప్రయత్నం చేశాడు.

  ఆ యువతి చేతిలో చావు దెబ్బలు తింటున్న ప్రియుని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తే ఆ యువతి తిరగబడి డెలివరీ బాయిని కొట్టింది.. అప్పటి వరకు ఓపిగ్గా ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ , అమ్మాయిని రెండు దెబ్బలు బలంగా కొట్టడంతో , పాపం ఆ ప్రియురాలు భయపడి పోయి అలాగే నిలబడిపోయింది . ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆమె ప్రియుణ్ణి కొడుతున్నంతసేపు మౌన ప్రేక్షకుల్లా గా చూస్తున్నా,ఆమెను డెలివరీ బై రెండు దెబ్బలు వేసే సరికి ఆమెను రక్షించారు..

  ప్రియుణ్ణి కొట్టొద్దని వారించిన డెలివరీ బాయిని ఎందుకు కొట్టావని కూడా అమ్మాయిని మందలించారు. అయినా మాట వినని ఆ యువతి రోడ్డు పక్కన ఉన్న రాళ్లు తీసుకుని డెలివరీ బాయ్ పై విసిరేసింది. దీంతో బలంగా మరోదెబ్బ కొట్టడంతో , దెబ్బకు దెయ్యం దిగిందన్నట్టు అమ్మాయి శాంతించింది. పోలీసులొచ్చి , ప్రియుణ్ణి నడిరోడ్లో దారుణంగా కొట్టి , గాయపరిచినందుకు , అమ్మాయిపైనా , అమ్మాయిని కొట్టినందుకు డెలివరీ బాయిపైనా కేసులు పెట్టారు.. అమ్మాయి ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నడిరోడ్డు లో జరిగిన సంఘటన ఇది.. వీడియొ చూడండి..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.