భార్యను చంపేసి , సూట్ కేసులో ఉంచి ..

  0
  1796

  తిరుపతిలొ మిస్సింగ్ కేసులో వివాహిత మహిళ శవం వెంకటాపురం చెరువులో , సూట్ కేసులో తేలింది. భర్త వేణుగోపాల్ భార్యను ను హత్య చేసి ఆపై సూట్ కేసులో ఉంచి తాళం వేసి చెరువు నీటిలో పడవేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే , గత ఐదు నెలలుగా భార్య తనతోనే ఉందంటూ అత్తమామలను నమ్మించాడు. చివరకు అనుమానమొచ్చి అడగడంతో , కిరాతకం బయటపడింది.

  తిరుపతి ,సత్యనారాయణపురం కు చెందిన సాఫ్ట్ వేర్ వేణుగోపాల్, తిరుపతిలోనే కొర్లకుంట కు చెందిన పద్మను వివాహం చేసుకున్నాడు. .కొంత కాలంగా భార్య భర్తల మధ్య వివాదం నెలకొనడంతో విడాకుల కోసం ప్రయత్నాలు చేసాడు., అయితే సర్దుబాటు కాలేదు. చివరకు భార్యని హైదరాబాద్ తీసుకుపోతున్నానని , జనవరిలో తీసుకెళ్లాడు.

  అప్పటినుంచి ఆమెతో తల్లితండ్రులు మాట్లాడాలని ప్రయతంచేసినా , ఏదో ఒక సాకు చెప్పేవాడు. చివరకు నిలదీయడంతో , ఆమెను చంపేసి , సూట్ కేసులో పెట్టి , తిరుపతికి తీసుకొచ్చి , చెరువులో పడేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటరావడంతో , చెరువులో , ఆమె శవం ఉంచిన సూటుకేసు పారేసిన ప్రాంతాన్ని చూపించాడు. శవం పూర్తిగా కుళ్లి పోయిఉంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..