అనిల్ అంబానీ లక్షలకోట్లు ఎగవేశాడు.కొడుకేమో?

  0
  711

  అనీల్ అంబానీ రెండు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి దివాళా తీశారు. ఆయన ఆస్తిని కోర్టులో జీరో ప్రాపర్టీగా చూపించారు. అయితే అలాగని అనీల్ అంబానీ.. ఆయన భార్యాబిడ్డలు బిచ్చమెత్తుకోవడం లేదు.. కూటికి లేక పస్తులున్నారని భావించొద్దు.. అనీల్ అంబానీ రెండు లక్షల కోట్లు ఎగ్గొట్టినా.. ఆయన కొడుకు జై అనుమోల్ అంబానీ మాత్రం 20 వేలకోట్లకు అధిపతి. మూడు సొంత విమానాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే అర్ధమైందేమంటే పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు ఎగ్గొట్టిన బిడ్డలు మాత్రం కోటీశ్వరులు గానే ఉంటారు.

   

  అంబానీ కుటుంబం గురించి ఎవ‌రికీ తెలియంది కాదు. కార్పోరేట్ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ధీరూభాయ్ అంబానీ ఆస్తులను పంచుకున్న ఇద్ద‌రు కుమారుల్లో ఒక‌రు అన్న ముఖేష్ అంబానీ అయితే త‌మ్ముడు అనిల్ అంబానీ. ఎవ‌రి వ్యాపారాలు వారివి. ఎవ‌రి దారి వారిది. అన్న సంపదను పెంచుకుంటూ పోతే.. త‌మ్ముడు ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. ప్ర‌స్తుతం అనిల్ అంబానీ దివాలా తీశారు. అనిల్ అంబానీ ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడి హోదాను అనుభవించారు.

   

  ఇప్పుడు మాత్రం పరిస్థితులు తలకిందులయ్యాయి. సంపాదించిన సొమ్ము అంతా చేజార్చుకున్నారు. రుణాల ఎగ‌వేత‌కు సంబంధించి ఆయ‌న‌పై కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఓ కేసుకు సంబంధించి బ్రిట‌న్ కోర్టుకు అందించిన డాక్యుమెంట్ల‌లో త‌న సంప‌ద సున్నా అని అనిల్ అంబానీ పేర్కొన్నారు. బ్యాంకుల రుణం తీర్చాలంటే అమ్మేందుకు తన దగ్గర ఇప్పుడు ఆస్తులు ఏవీ లేవ‌న్నారు. చైనా బ్యాంకులతో తలెత్తిన రుణ ఒప్పందం వివాదంపై కోర్టుకు ఆయన ఈ మేరకు వివ‌ర‌ణ‌ ఇచ్చారు.

   

  ఇదిలావుంటే… అనిల్ అంబానీ కొడుకు జై అన్మోల్ అంబానీ కూడా బ‌డా వ్యాపార‌వేత్త‌. 31 ఏళ్ళ వ‌య‌సు. మూడు సొంత విమానాలు… 28 హై అండ్ మోడ‌ల్ కాస్ట్‌లీ కార్లు… 20 వేల కోట్లు ఆస్తి… విలాస‌వంత‌మైన జీవితం.. ఇవ‌న్నీ అన్మోల్ సొంతం. ఇంత ఆస్తి కొడుకు పేరిట ఉన్నా కూడా .. బ్రిట‌న్ కోర్టుకు అనిల్ అంబానీ జీరో బ్యాలెన్స్ షీట్ చూపించ‌డం విడ్డూరం. అయినా కార్పోరేట్ సెక్టార్‌లో ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణం.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..