వరుసగా 12 ఫ్లాపులు..బయటపెట్టిన కృష్ణ.

  0
  224

  వరుసగా 12 ఫ్లాపులు..
  సంచలనం విషయాలు బయటపెట్టిన కృష్ణ..
  =======================
  సూప‌ర్ స్టార్ కృష్ణ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయన జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కూతురు మంజుల చేసిన స్పెష‌ల్ ఇంట‌ర్వూలో కృష్ణ ఎన్నో విషయాలను బయటపెట్టారు. కృష్ణ త‌న జీవితంలోని విశేషాలు, సినిమాలు, ఇత‌ర విశేషాల‌ను ఈ ఇంట‌ర్వూ ద్వారా బ‌య‌ట పెట్టారు. కృష్ణ ప‌ని అయిపోయింది అనుకున్న స‌మ‌యంలో సూప‌ర్ హిట్లు కొట్టిన చిత్ర విశేషాల గురించి ఈ ఇంట‌ర్వూలో పంచుకున్నారు.

  ఓ దశలో సినిమా ఇండస్ట్రీలో 12 ఫ్లాపులు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తనకు ఎవరూ సినిమాలో ఛాన్సులు కూడా ఇవ్వలేదని బాధపడ్డారు. చివరికి సొంతంగా పాడిపంటలు అనే సినిమాని తీశానని.. ఆ సినిమా విజయవంతం కావడంతో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు.

  మహేష్ బాబు మొదటగా సినిమాల్లో నటించడానికి కూడా ఒప్పుకోలేదని చెప్పారు. చిన్నతనంలో ఓసారి సినిమాల్లో నటించమని అడిగితే.. అక్కడినుంచి పరుగెత్తి వెళ్లిపోయారని సరదాగా అప్పటి విషయాలను పంచుకున్నారు. మహేష్ మూవీల్లో పోకిరి, దూకుడు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడతాయని తానూ ముందే చెప్పానన్నారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..