మందుకొట్టి చిక్కిపోయిన పైలెట్లు.

    0
    272

    మందుకొట్టి బైక్ నడపడం తెలుసు, మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తారు , మందుకొట్టి బస్సు లారీ నడపడం అనేది మనం వింటూనే ఉంటాం . కానీ మందు కొట్టి విమానం నడపడం మీరు ఎప్పుడైనా విన్నారా..? తప్పకుండా వినాల్సిన విషయం. విమానంలో పైలెట్లకు విమానం లోపల సిబ్బందికి డ్యూటీ కి పోయేముందు ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అని టెస్ట్ చేస్తారు . వాళ్ళు మందు కొట్టలేదని గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప వాళ్ళని డ్యూటీకి అనుమతించరు .

    అయితే గత నాలుగు నెలల్లో డ్యూటీ కి వచ్చిన తొమ్మిది మంది పైలెట్లు, 32 మంది విమాన సిబ్బంది మందు కొట్టి వచ్చారు. వీళ్లంతా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో దొరికి పోయారు . దీంతో వీళ్ళందర్నీ సస్పెండ్ చేసినట్టు విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ అయిన 9 మంది పైలెట్లులో , ఇద్దరు పైలెట్లు, మరో ఇద్దరు సిబ్బందిని మూడేళ్ల పాటు సస్పెండ్ చేశారు .

    దీనికి కారణం వాళ్ళు రెండో దఫా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో దొరికి పోయారు. మిగిలిన ఏడు మంది పైలెట్లు 32 మంది సిబ్బందిని మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మొదటిసారి మందుకొట్టి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కి చిక్కిన వాళ్లే ఎక్కువ. ఆకాశంలో ప్రయాణించే విమానాల్లో పైలెట్లు మందుకొట్టి గాలిలోతేలిపోతోంటే ఇక ప్రాణాలకు భద్రత ఎక్కడ..?

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.