ఇడ్లి తల్లికి ఇల్లుకొనిచ్చిన ఆనంద్ మహీంద్రా.

  0
  405

  మాతృ దినోత్సవం రోజు చాలా మంది కొడుకులు వృద్ధాశ్రమాలు పోయి తమ తల్లి తండ్రులతో సెల్ఫీ దిగి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తల్లిదండ్రులను సరిగ్గా చూడలేని వాడు కూడా మాతృ దినోత్సవం రోజు మాత్రం శుభాకాంక్షలతో సరిపెట్టుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా మాత్రం మాతృ దినోత్సవం రోజున పవిత్రమైన కార్యక్రమాన్ని చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు.

  అది ఏంటంటే ఒక్క రూపాయి ఇడ్లీ తో గత 30 ఏళ్లుగా సేవలో ఉన్న 86 ఏళ్ళ అమ్మకు ఓ ఇల్లు కొనిచ్చి మంచిపని చేశారు. ఆమె తన తల్లి కాకపోయినా , 86 ఏళ్ళ వయసులో , చట్నీ , సాంబార్ తో ప్లేట్ ఇడ్లీలు రూపాయికే ఇస్తోంది . . ఆ పేద తల్లి 30 ఏళ్లుగా 86 ఏళ్ళ వయసులో కూడా ఇడ్లీ అమ్ముకుంటూ లాభాపేక్ష లేకుండా జీవితం సాగిస్తోంది .

  తమిళనాడులో ఆమెను ఇడ్లి అమ్మ అంటారు.. మాతృ దినోత్సవం రోజున ఆకలి తీర్చడంలో అందరికీ తల్లి లాగా ఉన్న ఆ పేద వృద్ధురాలికి ఒక ఇల్లు కొనిచ్చి మాతృ దినోత్సవం రోజున నిజంగా మాతృమూర్తులు గర్వపడే పనిచేశారు . మాతృ దినోత్సవం రోజున ఆయన తరపున ప్రతినిధులు ఇంటిని ఆమెచేత ప్రారంభింపజేశారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.