విమానం ఆకాశంలో ఉండగా పైలెట్ కి గుండెపోటు..

  0
  164

  విమానంలో ఆకాశంలో ఉండగా అకస్మాత్తుగా పైలెట్ అస్వస్థతకు గురైతే ఏం చేయాలి ..? కో పైలెట్ కూడా లేని ఆ విమానంలో జరిగిన ఈ సంఘటన సంచలనమైంది. అసలు విమానం నడపడం చేతగాని వ్యక్తి ఆ పైలెట్ స్థానంలో కూర్చుంటే ఆ విమానం క్షేమంగా ల్యాండ్ కాగలదా ప్రశ్న ఎలా ఉన్నా .. అమెరికాలో ఇది జరిగింది. 14 మందితో పోతున్న సెస్నా విమానం ఆకాశంలో పోతోంది . ఇది ఫ్లోరిడా ఎయిర్ పోర్ట్ లో దిగాల్సి ఉంది .

  అయితే విమానం ఆకాశంలో ఉండగానే ,పైలెట్ కు గుండెపోటు వచ్చింది . దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులుకంగారు పడ్డారు. పైలెట్ విలవిలలాడిపోతూ ఉండగా విమానంలోని ఓ ప్రయాణికుడు ధైర్యం చేసి ఆ సీట్లో కూర్చున్నాడు .

  ఎయిర్ ట్రాఫిక్ అధికారుల సూచనలతో విమానాన్ని కంట్రోల్ చేసి పామ్ బీచ్ ఎయిర్ పోర్ట్ లో దించేశాడు. నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయమని అధికారులు చెబుతున్నారు. విమానం నడపడం చేతకాని ఆ వ్యక్తి , కంట్రోల్ రూమ్ ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించే క్షేమంగా ఎయిర్ పోర్ట్ లో దించడం గొప్ప విషయమని ప్రపంచంలో జరిగే అద్భుతాలలో ఇదొకటని ప్రశంసించారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.