లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి కొడుకుని బాగా చదివించి, విదేశాలకు పంపి ఉన్నత చదువులు చెప్పించి మంచి ఉద్యోగంలో సెటిల్ చేసి పెళ్లి చేసి, ఇల్లు కట్టించి ఇచ్చినా కొడుకు కోడలు నిర్లక్ష్యానికి గురైన ,ఓ తండ్రి కోర్టులో విచిత్రమైన కేసు వేశాడు. టి ఆర్ ప్రసాద్ అనే ఈ తండ్రి తన ఒకే ఒక కొడుకుకు 2016 లో పెళ్లి చేశాడు . అంతకు ముందు కొడుకును ఇంజనీరింగ్ చదివించి , తర్వాత మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా పంపించాడు. తర్వాత పెళ్లి చేశాడు. ఇప్పుడు పెళ్లి తర్వాత ఇల్లు కూడా కట్టించాడు . అన్ని అయిన తర్వాత కొడుకు వేరు కాపురం పెట్టాడు.
తల్లిదండ్రులను చూడడం మానేసి పట్టించుకోలేదు. దీంతో తండ్రి ప్రసాద్ కోర్టులో కేసు దాఖలు చేశాడు . తనకు ఏడాదిలోగా కొడుకు రెండున్నర కోట్లు, కోడలు రెండున్నర కోట్లు మొత్తం ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని , డబ్బులు ఇవ్వకపోతే తనకు మనవడినో , మనవరాలినో కని ఇవ్వాలని డిమాండ్ చేశాడు . కొడుక్కి పెళ్లి అయిన తర్వాత నుంచి బిడ్డలు కలగకుండా తన కొడుకు కోడలు కంట్రోల్ చేసుకున్నారని ప్రసాద్ అన్నాడు.
మీ చదువులకు , ఇంటి నిర్మాణానికి పెట్టిన డబ్బులు ఇవ్వండి లేదా బిడ్డను అయినా కనండి అంటూ ఈ పెద్దాయన వేసిన పిటిషన్ను న్యాయమూర్తి కూడా మానవతా దృక్పథంతో విచారణకి స్వీకరించారు , . బిడ్డలు , ప్రయోజకులు అయ్యాక తల్లితండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని జడ్జి అన్నారు. తల్లితండ్రులను , పిల్లలు చూడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ , మరోవైపు డబ్బులు ఇవ్వకపోయినా పిల్లలను అయినా కని ఇవ్వమని అడగడం అతని లోని మానసిక సంఘర్షణను తెలియజేస్తోందని వ్యాఖ్యానిస్తూ ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించారు .
పిల్లలు కనడం , కొడుకు కోడలు నిర్ణయమైనా లక్షలు పెట్టి కొడుకును చదివించి ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తల్లిదండ్రులను విస్మరించడం న్యాయం కాదని అభిప్రాయపడ్డారు. మిమ్మల్ని చదివించి ,ఉద్యోగం ఇప్పించి, అప్పులు పాలైన నాకు డబ్బులు ఇవ్వండి , డబ్బులు ఇవ్వలేకపోతే మనవడు మనవరాలుని అయినా ఇవ్వండి అని కోర్టుకెక్కిన పెద్దాయన కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది..