22 వీధికుక్కలతో రెండేళ్లుగా 11 ఏళ్ళ బాలుడు.

  0
  2174

  ఈ తల్లిదండ్రుల ఉన్మాదం , కిరాతకం , మూర్ఖత్వం ఏమో తెలియదు గానీ తమ 11 ఏళ్ళ కొడుకు జీవితాన్ని కుక్కకంటే దారుణంగా చేశారు. రెండేళ్లుగా 22 వీధి కుక్కలతో ఒక అపార్ట్మెంట్ లో కొడుకుని పెట్టి తాళం వేసి కాలం గడుపుతున్నారు. పూణేలోని కంద్వా ప్రాంతంలో శివార్లలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడు కిటికీ వద్ద కూర్చొని బయటికి చూస్తూ కనబడుతుంటాడు.

  22 వీధికుక్కలతో బాలుడిని అపార్టుమెంట్లో పెట్టి బయటకెళ్లిపోతున్న తల్లితండ్రుల కిరాతకాన్ని బాలల హక్కుల సంరక్షణ సంస్థ నిర్వాహకురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది . దీంతో పోలీసులు అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి తల్లిదండ్రులను పిలిపించి అపార్ట్మెంట్ తలుపులు తీసి ఆశ్చర్యపోయారు. అప్పటికే 22 కుక్కల్లో నాలుగు కుక్కలు అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉన్నాయి . అపార్ట్మెంట్ మొత్తం కుక్కల మలమూత్రాలతో గబ్బు కొడుతుంది. అయినా ఆ బాలుడు అపార్ట్ మెంట్ లోనే ఉన్నాడు .

  ప్రతి రోజు తల్లిదండ్రులు అపార్ట్మెంట్ వద్దకు వచ్చి వాటికి ఆహారం ఇచ్చి పోతుంటారు . రెండేళ్లుగా అపార్ట్మెంట్ లో 22 కుక్కలతో , నాలుగు చనిపోయిన కుక్కల మధ్య పోలీసులు చూసేటప్పటికీ మతిపోయింది. ఆ బాలుడు కుక్కలాగా ప్రవర్తిస్తున్నాడని , అతని మానసిక పరిస్థితి గత రెండేళ్లలో ఆ విధంగా తయారయిందని పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు.

  ఈ బాలుడి తండ్రికి ఒక దుకాణం ఉంది . తల్లి డిగ్రీ వరకు చదువుకుంది . తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇదేమని ప్రశ్నిస్తే తమకు వీధి కుక్కలు అంటే చాలా ఇష్టం అని , తమకిష్టమైనవి వాటిని చూసేందుకు తమ కొడుకును కూడా అపార్ట్మెంట్లో ఉంచామని చెప్పారు. ఆ బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి , కేసు నమోదు చేసి బాలుడిని తల్లిదండ్రులను అరెస్టు చేశారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.