ఆ పాకలో అల్లు అర్జున్ టిఫిన్ తింటున్నాడని తెలిసి ఉంటే ..?

  0
  1890

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న సింప్లిసిటీని చూపించాడు. పుష్ప సినిమా షూటింగ్ లో భాగంగా ఆయ‌న తూర్పుగోదావ‌రి జిల్లాకు వ‌చ్చారు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ జ‌రగాల్సి ఉండ‌గా, వ‌ర్షాల కార‌ణంగా షూట్ క్యాన్సిల్ అయింది. దీంతో త‌న కాన్వాయ్ లో కాకినాడ ప‌రిస‌ర ప్రాంతాల‌ను చుట్టేశాడు బ‌న్నీ. ముందుగా కాకినాడ థియేటర్లో గోపీచంద్ న‌టించిన‌ ‘సీటీమార్’ సినిమా చూశాడు. అనంత‌రం గోకవరం దారిలో వెళుతూ రోడ్డు పక్కన ఆగాడు. అక్కడున్న ఓ చిన్న హోటల్‌లో టిఫిన్ చేశారు. ఆ తర్వాత తానే స్వయంగా డబ్బులు చెల్లించి వెళ్లిపోయాడు. దీంతో ఆ షాపు యజమాని సంతోషంతో పొంగిపోయాడు. బన్నీ సింప్లిసిటీ చూసి అల్లు ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్