రాజీవ్ గాంధీ హత్యకేసులో పెరియవలన్ చరిత్ర ఇదీ.

    0
    1088

    రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉరిశిక్ష పడ్డ పెరియవలన్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను తల్లితో సహా కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో ఉరిశిక్షపడ్డ దోషులలో పెరియవలన్ ఒకరు. ఈ ఏడాది మర్చి నుంచి అతడు పెరోల్ పైనే ఉన్నారు. తమ ఉరిశిక్షలను , యావజ్జేవ శిక్షలుగా మార్చిన తరువాత , తన విడుదలకోసం ఆయన సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో , ఆయన సీఎం స్టాలిన్ ని తల్లి తోడురాగా కలిసాడు. తల్లితో కలిసి ప్రశాంతంగా బ్రతకాలని స్టాలిన్ హితబోధ చేశాడు .

    అసలు పెరియవలన్ ఎవరు ..?

    ==================

    రాజీవ్ గాంధీ హత్య కేసులో అతని పాత్ర ఏమిటో ఇప్పటి తరానికి చాలామందికి తెలియదు.. దాదాపు 31 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నపెరియవలన్ 1991వ సంవత్సరంలో 19 ఏళ్ల వయసులో రాజీవ్ గాంధీ హత్య లో దోషిగా ఉన్నాడు. రాజీవ్ గాంధీని మానవ బాంబులు సాయంతో పేల్చివేసిన ఈ దుర్ఘటనలో మానవ బాంబు పేలుడుకి అవసరమైన 9 వోల్టుల బ్యాటరీలు కొనుగోలు చేసి పెరియవలన్ తీసుకొచ్చాడు. ఏ బ్యాటరీల సాయంతోనేతోనే థాను అనే యువతి , మానవ బాంబుగా మారి తన బెల్ట్ బాంబుని పేల్చుకొని రాజీవ్ గాంధీని చంపేసింది. మే 21వ తేదీ 1991వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ని రాత్రి 10 గంటల 20 నిమిషాల సమయంలో బహిరంగ సభ వేదిక వేదిక మీదకు పోతుండగా థాను అనే మహిళ తన శరీరాన్ని కట్టుకున్న బాంబులు పేల్చి చంపేసింది ఈ కారణంగా ఆమె తో పాటు రాజీవ్ గాంధీతో సహా మరో 16 మంది చనిపోయారు.

    ఈ కేసులో 41 మందిని నిందితులుగా చేర్చగా వారిలో విచారణ సమయంలో ని 12 మంది చనిపోయారు . మరో ముగ్గురు పరారయ్యారు. సుదీర్ఘమైన విచారణ తర్వాత కోర్టు 26 మంది నిందితులకు ఉరి శిక్ష విధించింది. ఆ తర్వాత 1999 లో సుప్రీంకోర్టు మురుగన్ , సెంథాన్ , పెరియవలన్ మరియు నళిని లకు విధించిన మరణశిక్ష ఖరారు చేసింది . మరో ముగ్గురికి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. మరో 19 మందిని విడుదల చేసింది .ఆ తరువాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు మరణ శిక్ష పడ్డ అందరికీ జీవితఖైదులుగా శిక్షలు మారాయి.. భారతీయ వ్యవస్థలోనే అత్యంత గందరగోళ తీర్పులు , ప్రభుత్వాల సిఫార్సులు ఈ కేసులో అనేక మలుపులు .. చివరకు రాజీవ్ గాంధీ హంతకులు , కుట్రదారులు ఇప్పుడు బయటకొచ్చేశారు…

     

    ఇవి కూడా చదవండి..

    ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..