వామ్మో ఆ కటౌట్ ఏంది సామీ..!

  0
  103

  పవన్ పక్కన ఆయన కొడుకు అకీరా ఎంత ఎత్తున్నాడో చూడండి. తాజాగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తండ్రిని మించిన తనయుడు అంటూ, అకీరా కాబోయే సూపర్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు.
  అకీరా పక్కన నిలబడ్డ ఆమె ఓ మ్యూజిక్ టీచర్. ఆమే ఇప్పుడు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాదు. పవన్, అకీరాతో కలిసి సంగీతం నేర్చకోబోతున్నారట. ఈ విషయాన్ని కూడా ఆ మ్యూజిక్ టీచర్ వెల్లడించింది. తన వద్ద పవన్, అకీరా సంగీతం నేర్చుకోబుతున్నారని… వారి ఇంటివద్దే డెమో పూర్తయిందని సోషల్ మీడియాలో పేర్కొంది. అంతే కాకుండా తాను పవన్ అభిమానని పేర్కొంది. డెమో సమయంలో పవన్ తో మాట్లాడేందుకు గంటల పాటు సమయం దొరికిందని సంతోషం వ్యక్తం చేసింది. పవన్ వయోలిన్ బాగా వాయిస్తారని కూడా ఆ మ్యూజిక్ టీచర్ చెప్పింది. సంగీతం క్లాసుల సంగతి ఎలా ఉన్నా.. పవన్, అకీరా కలసి ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కటౌట్ ఏంది సామీ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. త్వరలో అకీరా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..