పవిత్ర , నరేష్ , ఎందుకీ దాగుడు మూతలు ..

  0
  2075

  సీనియ‌ర్ హీరో న‌రేష్‌-ప‌విత్ర లోకేష్ లు పెళ్ళి చేసుకున్నార‌నే వార్తా క‌ధ‌నాలు, ప్ర‌సారాల‌పై ప‌విత్ర సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి త‌న ప‌రువును బ‌జారుకీడుస్తున్నారని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ క‌ర్నాట‌క రాష్ట్రం మైసూరులో సైబ‌క్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో ప‌విత్ర ఫిర్యాదు కూడా చేసింది. అయితే పెళ్ళి చేసుకోక‌పోయినా… వారిద్ద‌రూ లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నార‌ని క్లియ‌ర్‌గా అర్ధ‌మ‌వుతోంది.

  పవిత్ర లోకేష్.. కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర లోకేష్ భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. అయితే చ‌ట్ట‌బ‌ద్దంగా వీరిద్ద‌రూ విడాకులు ఇంకా తీసుకోలేదు. అప్ప‌టి నుంచి ఆమె హైద‌రాబాద్‌లోనే మ‌కాం ఉంటోంది. టాలీవుడ్‌లో బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌విత్ర కొనసాగుతోంది. ఈ క్ర‌మంలోనే వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో జంటగా న‌టించారు.

  ఆ పరిచయంతో నిజ జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని గాసిప్స్ వ‌చ్చాయి. ఆ గాసిప్ప్ నిజం చేస్తూ ఇద్ద‌రూ లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్‌లో మునిగి తేలుతున్నారు. గుళ్ళు, గోపురాలు కూడా జంట‌గా తిరిగారు. క‌లిసి పూజ‌లు కూడా చేసిన ఫోటోలు, వీడియోలు కూడా తెర వైర‌ల్ అయ్యాయి. క‌న్న‌డ ఛాన‌ల్‌లో ఓ ఇంట‌ర్వూలో కూడా న‌రేష్‌తో లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు ప‌విత్ర చెప్పుకొచ్చింది. న‌రేష్ కూడా గ‌తంలో త‌మ ఇద్ద‌రికీ ఇంకా పెళ్ళి కాలేద‌ని చెప్పుకొచ్చాడు. కాగా న‌రేష్ ఇప్ప‌టికే మూడు పెళ్ళిళ్ళు జ‌రిగి, పెటాకుల‌య్యాయి.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.