విద్యుత్ శాఖకు చివరకు ఉడతలమీదకు నెట్టిందా..?

    0
    487

    ఉడతా ఉడతా ఊచ్..ఇలా ఎందుకు చేశావోచ్..!
    శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రిలో ఆటో ప్రమాద ఘటనకు ఉడుత కారణమంటూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు ప్రకటించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మెయింటెనెన్స్ లేని కారణంగా జరిగిన ప్రమాదాన్ని మూగజీవాలపై నెట్టేయడాన్ని ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు.

    తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, తాజాగా ఉడుత వల్ల హై టెన్షన్ వైరు తెగడం ఇలాంటి ఘటనలన్నీ.. విఠలాచార్య సినిమాలో కూడా జరగవని వైసీపీ పాలనపై పంచులేస్తున్నారు.

    అభం శుభం తెలియని ఐదుమంది పేద కూలీలు మరణిస్తే కనీసం విచారణ పూర్తికాకముందే ఇలా ఉడతలపై నిందలు మోపడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా అధికారులు ఇలా కాకమ్మ కథలు చెప్పడంపై నెటిజన్లు కూడా భగ్గుమంటున్నారు.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.