ఆటబొమ్మ అమ్మాయిల ఆకలిచావులు..

    0
    167

    ప్రపంచంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్న థాయ్ ల్యాండ్ లో కరోనా వైరస్ ప్రభావంతో రెడ్ లైట్ ఏరియాల్లో అమ్మాయిలు విలవిల్లాడిపోతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో పర్యాటకరంగం దెబ్బతినిపోవడంతో బ్యాంకాక్, పట్టాయాకు పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది.

     

    దీంతో వేశ్యా వృత్తే జీవనాధారంగా బతికే అమ్మాయిలకు కష్టకాలం దాపురించింది. గత ఏడాది కరోనా మహమ్మారి, ఈ ఏడాది రెండో వేవ్ ప్రభావంతో.. మొత్తమ్మీద 1800మంది వేశ్యావృత్తిని ఆధారంగా చేసుకుని బతికే అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది.

     

    కనీసం తినడానికి తిండిలేక, కుటుంబాలను పోషించుకోలేక, వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంవైపునుంచి వారికి ఎటువంటి సహాయం అందడంలేదు. థాయ్ ల్యాండ్ లో కరోనాలాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

     

    అయితే వేశ్యావృత్తే జీవనంగా బతికే వారు ఈ పథకాలు తీసుకునేందుకు అర్హులు కారు. విచిత్రం ఏంటంటే థాయ్ ల్యాండ్ జాతీయాదాయంలో 12 శాతం ఆదాయం కేవలం వేశ్యా వృత్తి వల్లే వస్తోంది. ఇందుకోసమే పర్యాటకులు ఎక్కువగా బ్యాంగాక్, పట్టాయా లాంటి ప్రాంతాలకు పోతుంటారు.

     

    ప్రభుత్వానికి పర్యాటక రంగం ఆదాయంలో 12శాతం ఆదాయం వేశ్యల వల్లే వస్తే, వారి గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా ఆకలి చావులకు బలిచేస్తోందని, బ్యాంకాక్ రెడ్ లైట్ ఏరియా ఫోరం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అయినా తమ గోడు వినాలని కోరుతోంది.

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు