కియా కారు వాడుకోండి – వద్దంటే ఇచ్చేయండి..

    0
    202

    కియా కార్ల కంపెనీ శాటిస్ఫాక్షన్ గ్యారెంటీ స్కీమ్ ని అమలు చేసింది. కియా కార్నివాల్ ఎంపీవీ కారు తీసుకుని 30 రోజులు వాడుకుని, ఇష్టం లేకపోతే మళ్లీ తిరిగి ఇచ్చేయొచ్చు. దీనికి డబ్బులు కూడా ఏమీ తీసుకోరు. ఆ నెల రోజుల్లో 1500కిలోమీటర్లకు మించి తిరగకూడదు, కారుకి ఎటువంటి డ్యామేజీ లేకుండా ఉండాలి. ఈ ఎంపీవీ వెహికల్ 3రకాల సీటింగ్ సౌకర్యాలతో ఉంటుంది.

    ఏడుగురు లేదా 8మంది, లేదా 9మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. 2.2లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థ్యం కల ఈ కారు ఖరీదు 25లక్షలనుంచి 34లక్షల మధ్య ఉంది. గతేడాది ఈ ఎంపీవీ కార్లు 6200 అమ్ముడు పోయాయి. కొత్త ఆఫర్ తో సేల్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..