ఈనెల 28న ఎన్టీఆర్ 99వ జయంతి. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగా నందమూరి అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు బాలకృష్ణ. ఈ మేరకు రేపు రేపు ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం అంటూ బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్ ఫోటో ఉంచడంతో ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
A surprise at 8:45AM tomorrow.
Stay Tuned.#NandamuriTarakaRamaRao #NandamuriBalaKrishna@NBKFilms_ pic.twitter.com/NtJkF4cuc9— NBK FILMS (@NBKFilms_) May 26, 2021
అఖండ సినిమాకు సంబంధించి పాట విడుదల కాబోతోందనే ప్రచారం కూడా ఊపందుకుంది. అదే సమయంలో తండ్రికి నివాళిగా తన గానంతో బాలకృష్ణ శ్రీరామదండకం విడుదల చేస్తారని కూడా అంటున్నారు. మరి ఈ రెండిటిలో ఏది సర్ ప్రైజ్ గా ఉంటుందో చూడాలి.