5 హామీలు బాండ్ పేపర్ లో రాసిచ్చేశాడు..

    0
    1492

    జగన్ ని నవరత్నాలు.. నావి పంచరత్నాలు..
    నమ్మకం లేదా..? ఇదిగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా..
    పంచాయతీ ఎన్నికల్లో ఇదో వెరైటీ ప్రచారం..

    ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

    పంచాయతీ ఎన్నికల్లో బహుశా భారత దేశంలో ఎప్పుడూ ఇలాంటి హామీలు, ఈ రకంగా ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి, ఓ వార్డు మెంబర్ తరపున వైసీపీ నాయకుడొకరు ఈ హామీలను ఇచ్చారు. ఏదో నోటిమాటగా చెబితే పర్లేదు, ఈయన ఏకంగా నోటు మాటగా చెప్పారు. 20రూపాయల బాండ్ పేపర్ పై హామీలను రాసిచ్చారు.
    ఇంతకీ సదరు నాయకుడు పడాల రంగారెడ్డి రాసిచ్చిన హామీలు ఏవంటే..
    1. సంవత్సర కాలంపాటు ఊబలంక గ్రామస్తులందరికీ ఉచిత కేబుల్ టీవీ ప్రసారాలు.. (మీ తరపున 12 నెలలపాటు బిల్లు నేనే కడతా)
    2. సంవత్సర కాలంపాటు ఉచితంగా రేషన్ ( రేషన్ సరకులకు నేనే డబ్బులు కడతా )
    3. ఏడాదిపాటు ఉచితంగా తాగునీరు ( మీ వాటర్ క్యాన్లకు డబ్బులు నేనే ఇస్తా )
    4. గ్రామ ప్రజలందరికీ ఏడాదిపాటు బీపీ, షుగర్ టెస్ట్ లు ఫ్రీ ( ఉచితంగా టెస్ట్ లు చేయిస్తా )
    5. హైస్కూల్ విద్యార్థులకు 10మందికి ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సాయం..

    ఇవండీ ఆయన సెలవిచ్చిన పంచరత్నాలు. జగన్ నవరత్నాల ప్రకటిస్తే, సదరు వైసీపీ నాయకుడు పంచరత్నాలంటూ బాండ్ పేపర్ పై రాసిచ్చేశాడు.
    విచిత్రం ఏంటంటే.. ఇలా బాండ్ పేపర్ పై రాసిచ్చిన వ్యక్తి సర్పంచ్ గానూ, వార్డు మెంబర్ గానూ పోటీ చేయడంలేదు. సర్పంచ్ అభ్యర్థి మేడిశెట్టి సురేఖ, వార్డు మెంబర్ అభ్యర్థి కోనాల పేర్రెడ్డి తరపున ఇతను హామీ ఇచ్చాడన్నమాట..
    ఈ హామీలను 20రూపాయల బాండ్ పేపర్ పై రాసి, నోటరీ తో అటెస్టేషన్ చేయించి మరీ ఇచ్చారు. ఏపీ చరిత్రలోనే కాదు, మొత్తం భారత దేశ చరిత్రలో కూడా ఇదో కొత్తరకం హామీ.

    ఇవి కూడా చదవండి:

    మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

    బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?