వీడు డాక్టర్ ,మనిషి జన్మ ఎత్తిన మృగం.

  0
  1376

  వీడు డాక్టర్ , నీచుడు , నికృష్టుడు .. మనిషి జన్మ ఎత్తిన మృగం. ఇల్లరికం అల్లుడుగా ఉండి ప్రేమించి పెళ్లాడిన భార్యను కత్తితో పొడిచి , తర్వాత బయటకు ఈడ్చి , కారుతో తొక్కించి చంపిన ఉన్మాది. కోయంబత్తూరుకు చెందిన గోకుల్‌కుమార్‌ కాటన్‌ కొళత్తూరులోని ఓ ఆస్పత్రిలో డాక్టర్‌. మరో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న సమీప బంధువు కీర్తనను ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

  పెళ్ళైన తరువాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఉన్మాదిలా ప్రవర్తించేవాడు. దీంతో భార్య కీర్తన విడాకులు కోరింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం గోకుల్ వేరుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గోకుల్ , కీర్తన ఇంటికెళ్లి కత్తితో ఆమెను గొంతు కోసి , పిచ్చెక్కినట్టు పొడిచాడు. కిందపడ్డ ఆమెను బయటకు ఈడ్చి , రోడ్డుపై పడేసి , కారుతో తొక్కించి , పరారయ్యాడు.కారులో పారిపోతున్న గోకుల్ కారుకు చెంగల్పట్టు సమీపంలో ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రిలో చేర్పించారు..

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?