హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిజాబ్ అనేది ఇస్లామిక్ మతాచారం ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన సంప్రదాయం కాదని స్పష్టం చేసింది. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ హిజాబ్ పై దాఖలైన పిటిషన్లను విచారించింది. కర్నాటకలో ఇటీవల చాలా విద్యాసంస్థలు హిజాబ్ వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. శాంతి భద్రతలకు విఘాకం కలిగించిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో యూనిఫామ్ నిబంధన పెడితే కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్ఫష్టం చేసింది. యూనిఫామ్ ధరించడం ప్రాథమిక హక్కులపై దాడి కాదని చెప్పింది. కళాశాలల్లో యూనిఫామ్ నిబంధన ప్రాథమిక హక్కులపై సహేతుకమైన నిబంధన అని స్పష్టం చేసింది.
గత నెల 10వతేదీ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల్లో హిజాబ్, కాషాయ వస్త్రాలు ఈ రెండిటినీ విద్యా సంస్థల్లో నిషేధించింది. తదుపరి తీర్పు వెలువడే వరకు తమ ఆదేశాలు అమలులో ఉంటాయని కూడా కోర్టు స్పష్టం చేసింగి. హిజాబ్ ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే అని, ఒక సంస్థ, లేదా విద్యా సంస్థ తమ డ్రస్ కోడ్ ఎలా ఉండాలో చెబితే , దాన్ని ఉల్లంఘించే పరిస్థితి, ఆ హక్కు ఎవరికీ లేదని కోర్టు చెప్పింది. దీన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం కూడా సమంజసం కాదని స్పష్టం చేసింది. రితు రాజ్ అవస్థి, కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.