ప్రధాని మోదీ మెచ్చుకున్న వీడియో ఇది..

  0
  1404

  జింక ఒకటి రోడ్డు దాటుతూ కనపడితే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు, సంబరపడుతుంటారు చాలామంది. అలాంటిది 3వేల జింకలు ఒకేసారి రోడ్డు దాటితే, అలాంటి వీడియోని సోషల్ మీడియాలో పెడితే.. దానికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిదా అయిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును ప్రధాని మోదీ కూడా దాన్ని చూసి సంతోష పడ్డారు. రీట్వీట్ చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌ ఖాతాలో షేర్‌ అయిన వీడియోపై ప్రధాని స్పందించారు. ‘‘ అద్భుతం’’ అని కామెంట్‌ కూడా చేశారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. గుజరాత్‌, భావ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణజింకల నేషనల్‌ పార్కులో దాదాపు 3 వేల కృష్ణజింకలు ఒకేసారి రోడ్డు దాటుతున్నాయి.

  గుంపులు, గుంపులుగా అంత పెద్ద సంఖ్యలో చెంగు చెంగున ఎగురుతూ అవి రోడ్డు దాటటం నిజంగానే అద్భుతంగా ఉంది. ప్రధాని మోదీ ఈ వీడియోపై స్పందించటంతో అది​కాస్తా సోషల్‌మీడియాలో వైరలైంది.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?