కేరళలో సంపూర్ణ లాక్ డౌన్.. మూడో వేవ్ సంకేతమా?

  0
  447

  కేరళలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండురోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. మరోవైపు కేంద్రం నుంచి న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన నిపుణుల బృందం కేరళకు బయలుదేరింది. మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ‌కు నిపుణుల బృందం స‌హ‌క‌రిస్తుంది. కేర‌ళ‌లో ప‌ది శాతం పైగా పాజిటివిటీ రేటు న‌మోద‌వుతున్న 12 జిల్లాల్లో కేంద్ర బృందం ప‌ర్య‌టిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ‌లో అత్య‌ధికంగా 22,056 తాజా కేసులు వెలుగుచూశాయి.
  10శాతానికి పైగా పాజిటివిటీ రేటు..
  దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేసిన సమయంలో కూడా కేరళలో కేసులు త్వరగానే తగ్గాయి. ఓ దశలో కేరళ ఆదర్శంగా దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఇప్పుడు విచిత్రంగా కేరళ టాక్ ఆఫ్ ది నేషన్ అవుతోంది. కేరళలో పాజిటివిటీ రేటు 10శాతం పైగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా తక్కువగా నమోదవుతున్నప్పటికీ కేరళలో మాత్రం గడిచిన 6వారాలుగా 10 నుంచి 12శాతం రికార్డవుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండడంతోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు అధికారులు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?