గ్రహాంతర వాసులు కావు.. స్టార్ లింక్ శాటిలైట్లు..

  0
  249

  రాత్రి వేళ ఆకాశం వైపు చూస్తే, అప్పుడప్పుడు కనీసం 20నుంచి 30వరకు చుక్కలు ఒకే వరుసలో పక్షులు పోయినట్టు మెరుస్తూ పోతుంటాయి. వాటిని చూసి చాలామంది ఇటీవల కాలంలో గ్రహాంతర వాసులని ఇతరత్రా అనుకునేవారు. కానీ చీకట్లో మెరుస్తూ కదలిపోయే ఈ కాంతులన్నీ స్టార్ లింక్ ఉపగ్రహాలు. మనదేశంలో కూడా ప్రతి ప్రాంతంలో రాత్రి 7 నుంచి 9 గంటల సమయంలో ఆకాశంలో ఇవి వరుసగా పోతుంటాయి. ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని ఈ స్టార్ లింక్ శాటిలైట్లు కమ్యూనికేషన్ రంగంలో సంచలనం
  సృష్టించబోతున్నాయి. కర్నాటకలో చాలా గ్రామాల్లో వీటిని చూసి గ్రహాంతర వాసులనుకుని పుకార్లు పుట్టించారు. కానీ వాస్తవానికి ఇవన్నీ స్టార్ లింక్ కంపెనీ ప్రయోగించిన ఉపగ్రహాలు. ఒకే వరుసలో పోతుంటాయి.

  స్టార్ లింక్ శాటిలైట్లు
  స్టార్ లింక్ శాటిలైట్లు

  42వేల శాటిలైట్లు…
  ఒకటి కాదు.. రెండు కాదు.. ఇవి ఏకంగా 42 వేల శాటిలైట్లు ఉన్నాయి. ప్రపంచంలోని ఏ మూలకైనా డైరెక్ట్ గా స్పేస్ నుంచే ఇంటర్నెట్. భూమిపై ఏ ప్రాంతానికి పోయినా ఫుల్ ఇంటర్నెట్ సిగ్నళ్లు. ఇవన్నీ స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ చేపట్టిన ‘స్టార్ లింక్ శాటిలైట్స్’ మిషన్ తో సాధ్యం కాబోతున్నాయి. ఇందులో భాగంగా మరో 52 స్టార్ లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ కంపెనీ ఈనెల 18న అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ వాండెన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఆకాశంలోకి పంపింది. దీంతో స్టార్ లింక్ మిషన్ లో ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శాటిలైట్ల సంఖ్య 1,944కు చేరింది.

  ఎలాన్ మస్క్
  ఎలాన్ మస్క్

  తొలిదశలో భూమి నుంచి 550 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో వివిధ డిగ్రీల కోణంలో 4 వేల శాటిలైట్లను మోహరించేందుకు స్పేస్ ఎక్స్ ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత దశలవారీగా భూమి చుట్టూ 42 వేల శాటిలైట్లను మోహరించాలని, భూమిపై ఎక్కడికైనా ఇంటర్నెట్ సర్వీస్ ను అతి తక్కవ ధరకే అందించాలని ఎలన్ మస్క్ టార్గెట్ పెట్టుకున్నారు.

  స్టార్ లింక్ మిషన్ అంటే..?
  అంతరిక్షంలోకి పెద్ద సంఖ్యలో శాటిలైట్లను పంపి, భూమి అంతటా ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు స్పేస్ ఎక్స్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టే ‘స్టార్ లింక్ శాటిలైట్స్’ మిషన్. ప్రస్తుతం భూమికి 30 వేల కి.మి.పైగా దూరంలోని జియో స్టేషనరీ ఆర్బిట్ లోని కమ్యూనికేషన్ శాటిలైట్లను ఇంటర్నెట్ సర్వీసులకు వాడుతున్నారు. భూమిపై, సముద్రాల్లో వేల కిలోమీటర్ల పొడవునా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేసి ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నారు. దీనివల్ల ఖర్చు ఎక్కువవుతోంది. మరోవైపు ఇంటర్నెట్ సేవల ఖరీదూ ఎక్కువవుతోంది. అందుకే తక్కవ రేటుకి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే దిశగా స్పేస్ ఎక్స్ దృష్టి పెట్టింది. జియో స్టేషనరీ ఆర్బిట్​లో కాకుండా భూమికి చాలా దగ్గరగా లో ఎర్త్ ఆర్బిట్​ లోనే వేల శాటిలైట్లను మోహరించి, ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తోంది. వేలాది స్టార్ లింక్ శాటిలైట్లు భూమి చుట్టూ ఒకదాని వెంట ఒకటి వరుసగా తిరుగుతుంటాయి. రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే మెరుస్తూ వెళ్తున్న శాటిలైట్ల ట్రెయిన్ మాదిరిగా కన్పిస్తుందని చెప్తున్నారు. అంతరిక్షంలో ఒక శాటిలైట్ నుంచి మరో శాటిలైట్ కు డేటా ట్రాన్స్ ఫర్ చాలా ఈజీగా జరుగుతుందని, అన్ని చోట్లా శాటిలైట్లు ఉంటాయి కాబట్టి భూమిపై ఉండే గ్రౌండ్ స్టేషన్లకు డేటా బదిలీ కూడా ఫాస్ట్ గా అవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు డీటీహెచ్ సర్వీసులు వాడుకుంటున్నట్లుగా ఎక్కడైనా సరే.. యాంటెన్నా పెట్టుకుని నెట్ వాడుకోవచ్చు. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో తాము లక్షలాది మందికి ఇంటర్నెట్ అందిస్తున్నామని స్పేస్​ఎక్స్ కంపెనీ తెలిపింది.

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.