67 ఏళ్ళ ముసలాడు ,19 ఏళ్ళ అమ్మాయి…

  0
  186

  67 ఏళ్ళ ముసలాడు , 19 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. తానుగా, ఆ యువతి ప్రేమించుకున్నామని , పెళ్లి చేసుకున్నామని , తమకు రక్షణ కల్పించాలని హర్యానా హైకోర్టుకు వచ్చాడు.. దీంతో హైకోర్టు న్యాయమూర్తి గురుప్రీత్ సింగ్ బిన్నంగా స్పందించాడు. వెంటనే ఈ విచిత్ర ప్రేమ పెళ్లిపై విచారణకు ఆదేశించాడు. ఎస్పీని ఈ పెళ్లి విషయమై సిట్ తో దర్యాప్తు చేయించాలని ఆదేశించారు. పన్వాల్ కు చెందిన ఈ వింత ప్రేమ జంట పై విచారణ జరుగుతుంది.

  వృద్దుడికి ఇదివరకే పెళ్ళై ఏడుగురు పిల్లలున్నారు. అతడు మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడా లేదా అన్నది పరిశీలించాలని చెప్పారు. అమ్మాయి ఆర్థిక పరిస్థితి , మానసిక పరిస్థితిపై కూడా విచారణ చెయ్యాలని , మేజిస్ట్రేట్ దగ్గర హాజరు పరిచి , ఆమె చెప్పేది రికార్డ్ చెయ్యాలని , వారంలోగా ఇవన్నీ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఎస్పీని ఆదేశించారు ..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..