స్పీడ్ బ్రేకర్ దగ్గర గాల్లోకి ఎగిరిన ఓలా స్కూటర్..

  0
  464

  ఓలా స్కూటర్ డొల్లతనం మరోసారి బయటపడింది . ఇప్పటివరకు దాదాపు రిపోర్ట్ అయిన కేసులు ప్రకారం దేశంలో తొమ్మిది ఓలా స్కూటర్లు తగలబడిపోయాయి. నమోదు కాని కేసులు ఎన్ని ఉన్నాయో తెలీదు . ఇప్పుడు తాజాగా మరో ఓలా స్కూటర్ విచిత్రమైన యాక్సిడెంట్ కి గురైంది. ఈ స్కూటర్ తోలుతున్న యువకుడు , తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకున్నాడు. బల్వంత్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్లో తన కొడుకును ఓలా స్కూటర్ ఎలా ప్రమాదానికి గురి చేసిందో వివరించాడు. స్పీడ్ బ్రేకర్ వద్ద ఎక్స్ లెటర్ తగ్గించి బ్రేక్ వేస్తే ఓలా స్కూటర్ దానంతటదే అదే స్పీడ్ పెరిగిపోయి , గాల్లో ఎగిరి కింద పడేసింది.

  దీంతో ఆ బాలుడికి ఇరవై తొమ్మిది చోట్ల శరీరంపై కుట్లు వేయవలసి వచ్చింది . రెండు చేతులూ ఫ్రాక్చర్ అయ్యాయి . ఒక కాలు ఫ్రాక్చర్ అయింది. దాదాపు 15 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది . ఇప్పుడు ట్విట్టర్లో పెట్టిన పోస్టింగ్ లు వైరల్ అయ్యాయి . తన కొడుకు యాక్సిడెంట్ ఫోటోలతో సహా ఆయన ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేశారు . కంపెనీ మాత్రం , సాంకేతికంగా స్కూటర్ బాగానే ఉందని ,జాగ్రత్తగా డ్రైవ్ చేయమని మాత్రం సలహా ఇచ్చింది. బలవంత్ సింగ్ మాత్రం ఇప్పుడు వినియోగదారుల ఫోరంలో స్కూటర్ పై కేసు దాఖలు చేశాడు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.