500 రూపాయలకే ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు..

  0
  7568

  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ డెలివరీ ప్రారంభమైంది. చెన్నై, బెంగుళూరు నగరాల్లో 100 వాహనాలను కస్టమర్లకు అందజేశారు కంపెనీ ప్రతినిధులు. గత ఏడాది కాలంగా ఓలా ఈ బైక్స్ కోసం కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. ఓలా బైక్ ఎప్పుడు వస్తుందా అని ఇన్నాళ్లూ కస్టమర్లు ఎదురుచూపులు చూశారు. వారి ఆశలు నేటితో నెరవేరాయి. ఓలా కంపెనీకి చెందిన రెండు మోడళ్ళు తాజాగా కస్టమర్లకు డెలివరీ చేశారు. వాటిలో ఓలా ఎస్1 మోడల్ ధర రూ.99,999 కాగా, ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,29,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పటికే చాలా మంది ఈ బైక్ లను బుకింగ్ చేసుకున్నారు. కేవలం 500 రూపాయలకే ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. మరోవైపున ఈఎంఐ ఆప్షన్ కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు 2999 చెల్లించే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.