ఈ జీవికి 1,306 కాళ్లు.. సృష్టి విచిత్రం..

    0
    529

    ఆస్ట్రేలియాలో అరుదైన జీవిని క‌నుగొన్నారు. కాళ్ళ జెర్రిగా క‌నిపిస్తున్న ఈ జీవికి ఏకంగా వెయ్యికి పైగా కాళ్లున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని బంగారు గనుల్లో దీన్ని గుర్తించారు. 95 మి.మీ పొడవున్న ఈ జీవికి 1,306 కాళ్లు ఉండడం విశేషం. ఇన్ని కాళ్ళు ఉన్న జీవిని చూసి పరిశోధకులను ఆశ్చర్యానికి గుర‌వుతున్నారు. భూమిపై ఇప్పటివరకు గుర్తించిన అత్యధిక కాళ్లు కలిగిన జీవి ఇదేనట. ఓ గనిలో తవ్వకాలు జరుపుతుండగా 60 మీటర్ల లోతులో ఈ జీవి క‌నిపించింది. అయితే దీనికి కళ్లు లేవట‌. వాసన, స్పర్శ ద్వారా పరిసరాలను గుర్తిస్తుందని, శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు. దీనికి యుమిల్లిప్స్ పెర్సెఫోన్ అని నామ‌క‌ర‌ణం చేశారు.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.