సముద్రంలో బద్దలైన అగ్నిగోళం..

  0
  1543

  కోన‌సీమ, గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల్లో ఓఎన్జీసీ బావుల నుంచి మంట‌లు చెల‌రేగ‌డం… పైపులు ప‌గిలి జ్వాల‌లు పైకి ఎగ‌ర‌డం వంటివి అప్పుడ‌ప్పుడూ చూసుంటాం. కానీ స‌ముద్రంలో ఇలాంటి ఘ‌ట‌న‌ను బ‌హుశా ఎప్పుడూ చూసివుండం. ప్ర‌శాంతంగా ఉండే స‌ముద్రంలో అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైతే ఎలా ఉంటుంది. లావా ఒక్క‌సారిగా ఉప్పొంగితే ఎంత భ‌యంక‌రంగా ఉంటుంది. ప్ర‌శాంతంగా ఉండే క‌డ‌లి… క‌ల్లోల‌మైతే ఎలా ఉంటుంది. అంత భీభ‌త్సంగా క‌నిపించింది మెక్సికోలోని యుక‌టాన్ ద్వీప‌క‌ల్పం. ఈ ద్వీప‌క‌ల్పానికి పశ్చిమ సముద్రంలో పెమెక్స్‌ ఆయిల్‌ రిగ్గింగ్‌ సంస్థ ముడి చ‌మురును వెలికి తీస్తోంది. ఇందుకోసం సముద్రం లోపల రిగ్గింగ్‌ చేసి, అంతర్భాగంలో పైప్ లైన్లు ఏర్పాటు చేసింది. అయితే సముద్రం మధ్యలో పైప్ లైన్‌ పగిలిపోవడంతో ముడి చమురు ఒక్కసారిగా లీకైంది. ఆ త‌ర్వాత మంట‌లు ఉవ్వెత్తున ఎగ‌సిప‌డ్డాయి. నీలంగా క‌నిపించే స‌ముద్రం… ఎర్ర‌బ‌డిపోయింది. విషయం తెలుసుకున్న పెమెక్స్‌ సంస్థ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని దాదాపు 5 గంటలపాటు తీవ్రంగా శ్ర‌మించి మంటలు అదుపు చేసింది. స‌ముద్రంలో అగ్నిగోళాన్ని త‌ల‌పించే ఆ దృశ్యాన్ని చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.