ఎన్టీఆర్ ని బీట్ చేయలేకపోయిన చిరు..

    0
    95

    అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. తాజాగా చిరంజీవి, మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమాకోసం వాయిస్ ఓవర్ చెప్పడంతో ఈ పోలిక మొదలైంది. చిరంజీవి వాయిస్ బాగున్నా.. ఎన్టీఆర్ లాగా మెప్పించలేకపోయారని సోషల్ మీడియాలో కంపేరిజన్ చేస్తున్నారు అభిమానులు.
    కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు, సన్నాఫ్ ఇండియా మూవీతో మళ్లీ తెరపైకొస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, అన్యాయాలకు ఎదురెళ్లే మనిషిగా కనిపిస్తాడు. ఈ మూవీకి హైప్ ఇవ్వడానికి నిర్మాత మంచు విష్ణు చిరంజీవి సాయం అడిగారు. మోహన్ బాబుతో ఉన్న స్నేహంతో చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే చిరంజీవి వాయిస్ ఓవర్ కి మరీ అంత భారీ ప్రశంసలు దక్కలేదు.

    గతంలో ఆర్ఆర్ఆర్ మూవీకోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ తో పవర్ ఫుల్ డైలాగులు చెబుతారు.

    ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ పాత్ర పరిచయం సందర్భంగా కొన్ని డైలాగులు చెప్పినా అవి ఏమంత క్లిక్ కాలేదు.

    తాజాగా చరణ్ తండ్రి చిరంజీవి తన స్నేహితుడికోసం చెప్పిన డైలాగులు కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ముందు తేలియాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య ఇదే చర్చ నడుస్తోంది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..