ఎన్టీఆర్ రాజకీయాల్లోకి .. ఏమన్నాడో చూడండి..

  0
  179

  పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కి, బ్లాక్ బ‌స్ట‌ర్ గా దూసుకెళ్తున్న‌ ఆర్.ఆర్.ఆర్ సినిమా స‌క్స‌స్ ని చిత్ర‌యూనిట్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ యాక్టింగ్ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినీప్రియులు, ప్ర‌ముఖులు కూడా ఫిదా అయిపోయారు. దీంతో బాలీవుడ్ చానల్స్ కూడా ఈ స్టార్స్ తో స్పెష‌ల్ ఇంట‌ర్వూలు చేస్తున్నాయి. ఇటీవ‌లే ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించాడు యంగ్ టైగ‌ర్.

  న‌టుడిగా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టి 20 ఏళ్ళు పూర్త‌య్యాయ‌ని, ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. స‌క్స‌స్ వచ్చినప్పుడు దక్కే ఆనందాన్ని, ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు కలిగే బాధను.. ఆ క్షణం వ‌ర‌కే తీసుకుని, మ‌ళ్ళీ త‌న ప‌ని తాను చేసుకుంటూ ముందుకు పోతాన‌ని చెప్పారు. రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశంపై ప్ర‌శ్నించిన మీడియాకు త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను బైట‌పెట్టారు తార‌క్.

  ప్ర‌స్తుతం న‌ట జీవితాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. ఫ‌స్ట్ ప్ర‌యారిటీ దానికే ఉంటుంద‌న్నారు. భ‌విష్య‌త్ గురించి ఇప్ప‌టి నుంచే ఆలోచించే వ్య‌క్తిని కాదు. భ‌విష్య‌త్ అంటే నెక్ట్స్ సెకండ్ ఏంటి అనేది మాత్ర‌మే ఆలోచిస్తాన‌ని అన్నారు. రాజ‌కీయాలపై ఆలోచించేంత‌ స‌మ‌యం ఇంకా రాలేద‌న్నారు. ఇప్ప‌టికైతే న‌ట‌నారంగంలో అంతులేని సంతృప్తిని పొందుతున్నాన‌ని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.