ఇక మాస్క్ లేకపోతే నో ఫైన్.. ఎక్కడో తెలుసా.?

    0
    143

    మహారాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రజలకు నో మాస్క్ వరమిచ్చింది. మన రాష్ట్రంలో తెలుగు సంవత్సరాది ఉగాది తో ప్రారంభం అయితే మహారాష్ట్రలో దానిని గుడి పద్వ అంటారు .. మనకు ఉగాది ప్రారంభం రోజునే మరాఠీలకు మరాఠీలకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుకగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాస్క్ పై నిషేధాన్ని ఎత్తివేసింది . రెండో తేదీ నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మాస్కులు వేసుకోవడం, వేసుకోకపోవడం వాళ్ల ఇష్టం అని ప్రకటించింది.

    మాస్కులు వేసుకోకపోతే ఇకనుంచి మహారాష్ట్రలో ఎటువంటి జరిమానాలు ఉండవు . అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా భవిష్యత్తులో సామాజిక దూరం పాటించమని కోరుతున్నామని మంత్రివర్గం చెప్పింది. లేకపోతే ఫైన్ వేసే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలో ఢిల్లీ తర్వాత మహారాష్ట్రలోనే
    కరోనా వ్యాధి విజృంభించింది . దేశాన్ని అల్లకల్లోలం చేసింది.

    బొంబాయి నుంచి కరోనా ఇతర ప్రాంతాలకు అతి వేగంగా వ్యాపించింది . భారతదేశంలో మొదట ఢిల్లీలో పుట్టి మహారాష్ట్రలో పెరిగి ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన కరోనా వ్యాధి నుంచి దేశందాదాపు కోలుకుంది. మహారాష్ట్రలో దాదాపు పూర్తిగా కరోనా కేసులు తగ్గిపోయాయి. అందువల్ల కరోనా నిబంధనలను , ఆంక్షలను తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి నాందిగా దీనిని ఉగాది కానుకగా ప్రకటించేసింది..

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.