ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో 4. 76 కోట్లు.. ఎవరివి..??

  0
  81

  ఓ ప్రైవేట్ బ‌స్సులో భారీ న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. న‌గ‌దుతో పాటు బంగారం కూడా బ‌య‌ట‌ప‌డింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు త‌నిఖీ చేస్తుండ‌గా ప‌ద్మావ‌తి ట్రావెల్ బ‌స్సులో పెద్ద‌మొత్తంలో త‌ర‌లిస్తున్న న‌గ‌దు క‌నిపించ‌డంతో నోరెళ్ళ‌బెట్టారు. రూ.4.76 కోట్లతో పాటు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  విజ‌య‌న‌గ‌రం నుంచి గుంటూరు వెళుతుండ‌గా, సోదాలు నిర్వ‌హిస్తున్న పోలీసులు న‌గ‌దును గుర్తించారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉండేందుకు బ‌స్సు ల‌గేజ్ క్యారియ‌ర్ లో న‌గ‌దును భ‌ద్ర‌ప‌రిచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. వాటికి స‌రైన ప‌త్రాలు, ఆధారాలు లేక‌పోవ‌డంతో సీజ్ చేశారు.

  ఇంత‌పెద్ద మొత్తం త‌ర‌లిస్తున్న డ్రైవ‌ర్, క్లీన‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మ‌రో ఐదుమంది అనమానితుల్ని కూడా పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఎక్క‌డి నుంచి తీసుకొస్తున్నారు ? ఎక్క‌డికి త‌ర‌లిస్తున్నారు ? దీనివెన‌క ఉన్న‌ది ఎవ‌ర‌నే కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.